పోలీస్ ఎస్కార్ట్ నుంచి నిందితుడు పరారీ

Arun Chilukuri
Published on: 17 Dec 2020 12:10 PM IST
పోలీస్ ఎస్కార్ట్ నుంచి నిందితుడు పరారీ
X

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పోలీసుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఎస్కార్ట్ వాహనం నుంచి ఓ నిందితుడు తప్పించుకోవడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గణేష్‌ హత్య కేసుతో పాటు పీడీ యాక్ట్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కేసు విచారణ కోసం కొత్తగూడెం కోర్టుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నేరస్తుడు తప్పించుకున్న సమయంలో ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్‌, మరో నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story