దారుణం: పుస్తెలతాడు చోరీకి వెళ్లి.. చిన్నారిని సంపులో పడేశాడు..!

Jangaon: జనగామ జిల్లా అంబేద్కర్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 1 Aug 2022 2:47 PM IST
Thief Drowns Infant Baby in Pool
X

దారుణం: పుస్తెలతాడు చోరీకి వెళ్లి.. చిన్నారిని సంపులో పడేశాడు..!

Jangaon: జనగామ జిల్లా అంబేద్కర్‌ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్నాడు ఓ చైన్‌స్నాచర్‌. మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరించే ప్రయత్నం చేయగా మహిళ ప్రతిఘటించింది. దీంతో ఆ మహిళ చేతిలోనుంచి 10 నెలల చిన్నారిని బలవంతంగా లాక్కున్న దుండగుడు అక్కడే ఉన్న సంపులో పడేసి పరారయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వారికి మహిళ సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిన్నారిని సంపు నుంచి బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన జనగామ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాప చనిపోయినట్లు నిర్ధారించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story