CM KCR: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

There is no Need to Compromise on Law and Order
x

CM KCR: శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు

Highlights

CM KCR: అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

CM KCR: తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.

నగరంలో నెలకొన్న పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలని, ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories