కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ.. ఆలయం మూసివేత

Kondagattu: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు చొరబడ్డారు.

Arun Chilukuri
Published on: 24 Feb 2023 10:17 AM IST
Theft in Kondagattu Anjaneya Swamy Temple
X

కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ.. ఆలయం మూసివేత

Kondagattu: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో దొంగలు చొరబడ్డారు. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు సమాచారం. అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయ అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఆలయాన్ని మూసివేసిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story