బాటసింగారం గ్రామంలో 9 ఇళ్లల్లో చోరీ.. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్‌..

Batasingram: భారీ ఎత్తులో చోరీ జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా...

Shireesha
Published on: 17 Dec 2021 6:32 PM IST
Theft in 9 Houses in Batasingaram Village Abdullapurmet Police Station Area | Telangana News Today
X

బాటసింగారం గ్రామంలో 9 ఇళ్లల్లో చోరీ.. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్‌..

Batasingram: అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి బాటసింగారం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 9 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసిన దుండగులు ఈ చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటి యజమానులకి స్థానికులు సమాచారం అందించారు.

వాళ్ళు వస్తే కానీ ఎంత చోరీ జరిగింది అన్న విషయం తెలుస్తుందని పోలీసులు అన్నారు. చోరీ జరిగిన ఇళ్లని స్థానిక ఏసీపీ పురుషోత్తంరెడ్డి సిఐ స్వామి క్లూస్ టీమ్‌తో కలిసి పరిశీలించారు. భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్ళి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story