Telangana: థియేటర్ల బంద్‌కు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు..

Telangana: తెలంగాణలో థియేటర్ల బంద్‌కు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది.

Sandeep Eggoju
Published on: 21 April 2021 9:08 AM IST
Theaters are Bandh Due to Night Curfew In Telangana
X
థియేటర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: తెలంగాణలో థియేటర్ల బంద్‌కు థియేటర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ పిలుపునిచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతుండటంతో ప్రభుత్వం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ప్యూ విధించింది. రెండు షోలు వేసుకునే వీలు ఉన్నా ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇదివరికే పెద్ద స్టార్స్ సినిమాలన్నీ వాయిదా పడినప్పటికీ సినిమాలు రిలీజ్ చేయడానికి చిన్న నిర్మాతలు ఆసక్తి చూపారు. కానీ తెలంగాణలో కర్ప్యూ కారణంగా ఈ నెల 23న రిలీజ్ కావాల్సిన తెలంగాణ దేవుడు, ఇష్క్, శుక్ర సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో థియేటర్స్ ఓనర్స్ అసోషియేషన్ వకీల్‌సాబ్ చిత్ర డిస్ట్రిబ్యూటర్స్‌తో ఉన్న అగ్రిమెంట్ కారణంగా ఆ సినిమా ప్రదర్శించే థియేటర్లు మినహా అన్ని థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story