Hyderabad: జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణం.. వారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం

Hyderabad: కుటుంబసభ్యులకు మతిస్థిమితం లేదని అనుమానం

Shekhar G
Published on: 20 Dec 2023 12:58 PM IST
The Woman Dead Body Has Been In The House For A Week
X

Hyderabad: జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణం.. వారం రోజులుగా ఇంట్లోనే మహిళ మృతదేహం

Hyderabad: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో అమానవీయ సంఘటన జరిగింది. వారం రోజులు క్రితం ఓ ఇంట్లో మహిళ చనిపోయింది. అయితే వారం రోజులుగా మృత దేహానికి అంత్యక్రియలు జరపలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. కుటుంబ సభ్యులు మాత్రం.. ఏమాత్రం అనుమానం రాకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు. దీంతో మృతదేహం కుళ్లి పోయింది. తీవ్ర దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం ఇంట్లో ఉంచుకున్న కుటుంబ సభ్యులకు మతిస్థిమితం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story