వ్యూహం సినిమా రిలీజ్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

TS High Court: నేడు విచారణ జరిపి తీర్పు ఇవ్వనున్న హైకోర్టు

Jyothi
Published on: 8 Jan 2024 9:40 AM IST
The Telangana High Court will hear the release of the movie Vyooham today
X

వ్యూహం సినిమా రిలీజ్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ

TS High Court: డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా చుట్టూ రచ్చ జరుగుతోంది. సీఎం జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన వాస్తవ ఘటనల ఆధారంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవీ. ఈనెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్. అయితే ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించనుంది.

వ్యూహం సినిమా రిలీజ్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. నేడు విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది. ఈనెల 11 వరకు మూవీ రిలీజ్‌పై స్టే విధించింది హైకోర్టు సింగిల్ బెంచ్. రిలీజ్ ఆలస్యంతో కోట్లలో నష్టం వాటిల్లిందని ప్రొడ్యూసర్ కోర్టుకు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story