TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం.. అక్టోబర్‌ 14 తర్వాతే తొలి జాబితా

TS Congress: మరో రెండు వారాల తర్వాతే జాబితా ఉండే ఛాన్స్

Shekhar G
Published on: 30 Sept 2023 9:23 AM IST
The Telangana Congress Candidate List Is Further Delayed
X

TS Congress: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం.. అక్టోబర్‌ 14 తర్వాతే తొలి జాబితా

TS Congress: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ ఒకటో తేదీన సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ కమిటీ సమావేశంకానుంది. కాంగ్రెస్‌ పార్టీ వార్‌రూమ్‌లో కీలక భేటీ జరగనుంది. సమావేశానికి హాజరుకావాల్సిందిగా.. సభ్యులందరికీ మెసేజ్‌లు పంపారు. వచ్చేవారం మరోసారి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. మరో రెండు వారాల తర్వాతే జాబితా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 14 తర్వాతే తొలి జాబితా ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

Shekhar G

Shekhar G

Next Story