TS Cabinet: రేపు మరోసారి తెలంగాణ కేబినెట్‌ భేటీ

రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్‌ కొనసాగింపు కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు

Sandeep Reddy
Published on: 13 July 2021 9:22 PM IST
The Telangana Cabinet Will Meet Again Tomorrow
X

తెలంగాణ కేబినెట్‌ భేటీ (ఫైల్ ఫోటో)

TS Cabinet: కొన్ని గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ రేపు కూడా కంటిన్యూ కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ భేటీ కానుంది. ఇక రేపటి భేటీకి పూర్తి వివరాలతో అన్నిశాఖల కార్యదర్శులు హాజరవ్వాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు సత్వరమే చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని శాఖల్లోని ఖాళీలతో ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story