MLC Kavitha: కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

MLC Kavitha: సుప్రీంకోర్టులో ఎల్లుండి కవిత పిటిషన్‌పై విచారణ

Jyothi
Published on: 20 March 2024 2:38 PM IST
The Supreme Court Accepted Kavitha Petition
X

MLC Kavitha: కవిత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో ఎల్లుండి కవిత పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంను ఆశ్రయించారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ ఎల్లుండి విచారణకు రానుంది.

Jyothi

Jyothi

Next Story