Hyderabad: అల్వాల్‌లో దారుణం.. తండ్రిని గన్‌తో బెదిరించిన కొడుకు

The Son Threatened The Father With A Gun In Alwal
x

Hyderabad: అల్వాల్‌లో దారుణం.. తండ్రిని గన్‌తో బెదిరించిన కొడుకు

Highlights

Hyderabad: కొడుకు మద్యానికి బానిసవడంతో పునరావాసకేంద్రంలో చేర్పించిన తండ్రి

Hyderabad: హైదరాబాద్‌ అల్వాల్‌లోని సుభాష్‌నగర్‌లో తండ్రిని గన్‌తో బెదిరించాడు కొడుకు. మద్యానికి బానిసవడంతో కొడుకు థామస్‌ను.. తండ్రి పునరావాసకేంద్రంలో చేర్చించినప్పటికీ.. థామస్‌ తీరు మారలేదు. ఇదిలా ఉంటే.. ఇంట్లో పెంచుకునే గొర్రెల విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. తండ్రి మాజీ సైనికాధికారి కావడంతో ఇంట్లో ఉన్న డబుల్‌ బ్యారెల్‌ గన్‌తో కొడుకు.. అతడిని బెదిరించాడు. ఇది గమనించిన తల్లి.. కొడుకుపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే.. విచారణలో గన్‌ లైసెన్స్‌ గడువు ముగిసిందని తేలడంతో.. తండ్రిపైనా కేసు నమోదు చేశారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు అల్వాల్‌ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories