TS Police: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. ఈడీ, ఐటీ శాఖకు ఆర్థిక నేరస్థుల లిస్ట్

TS Police: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును.. ఈడీ, ఐటీకి సిఫార్సు చేసే అవకాశం

Shekhar G
Published on: 1 Feb 2024 4:30 PM IST
Sensational decision of Telangana Police Department
X

TS Police: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. ఈడీ, ఐటీ శాఖకు ఆర్థిక నేరస్థుల లిస్ట్

TS Police: అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇందులోభాగంగా తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అవినీతి పరులు, మోసగాళ్ల కేసుల్లో ఏళ్ల తరబడి ఎలాంటి మార్పు లేకపోవడంతో... కేసులను ఈడీ, ఐటీ శాఖకు బదిలీ చేయనున్నట్టు తెలుస్తుంది. అడ్డగోలుగా అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ఈడీ, ఐటీ చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

ఈడీ అయితే నిర్ణీత సమయంలో..అక్రమ ఆస్తులను జప్తు చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. అక్రమార్కులకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో.. పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అవినీతి పరులను, అక్రమార్కులను కట్టడి చేయడానికి ఆయా విభాగాలను రంగంలోకి దించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏసీబీ టేకప్ చేసిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును.. ఈడీ, ఐటీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story