Narendra Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు

Narendra Modi: హైదరాబాద్‌లో రోడ్‌ షో అనంతరం ఢిల్లీకి తిరుగుప్రయాణం

Shekhar G
Published on: 22 Nov 2023 5:10 PM IST
The schedule of Prime Minister Modi Visit To Telangana Has Been Finalized
X

Narendra Modi: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు

Narendra Modi: తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ అగ్రనేతలు వరుస పర్యటనలతో ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగసభలతో ప్రచారాలు చేస్తుండగా.. ఈనెల 25 నుంచి మూడు రోజుల పాటు ప్రధాని మోడీ ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 25న తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ.. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లా్ల్లో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 25 నిమిషాలకు దుండిగల్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొంటారు. ఆరోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు ప్రధాని.

ఇక 26న దుబ్బాక, నిర్మల్‌లో బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రధాని. మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాక వెళ్లనున్న ప్రధాని.. 2 గంటల 45 నిమిషాల వరకు దుబ్బాకలో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. అనంతరం నిర్మల్ కు వెళ్లి... మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ప్రసంగిస్తారు. బహిరంగ సభల అనంతరం దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు తిరుపతికి బయలుదేరతారు ప్రధాని.

27వ తేదీన తిరుపతి నుంచి 11 గంటల 30 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని.. నేరుగా మహబూబాబాద్ వెళ్తారు ప్రధాని. 12 గంటల 45 నిమిషాలకు మహబూబాబాద్‌లో ప్రసంగించి.. ఆ తర్వాత కరీంనగర్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో అనంతరం ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీ బయలుదేరతారు ప్రధాని.

Shekhar G

Shekhar G

Next Story