Kamareddy: ఫలించిన అధికారుల కృషి.. గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..

Kamareddy: కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి వద్ద గుహలో ఇరుక్కున్న రాజు సురక్షితంగా బయటపడ్డాడు.

Arun Chilukuri
Published on: 15 Dec 2022 2:56 PM IST
Rescue Operation Completed Successfully in Kamareddy
X

Kamareddy: ఫలించిన అధికారుల కృషి.. గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి..

Kamareddy: కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి వద్ద గుహలో ఇరుక్కున్న రాజు సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్యఆరోగ్య శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతడిని రక్షించారు. సుమారు 42 గంటల తర్వాత అధికారుల కృషి ఫలించడంతో రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శరీరంపై గాయాలు కావడంతో అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో రాజు.. మంగళవారం సాయంత్రం వేటకు వెళ్లాడు. అక్కడున్న ఓ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. రాళ్ల మధ్యలో ఇరుక్కున్నాడు. గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్యఆరోగ్య శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతడిని రక్షించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story