Venkat Balmoor: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజుల్లో.. TSPSC ప్రక్షాళన చేశాం

Venkat Balmoor: గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది

Shekhar G
Updated on: 5 March 2024 8:15 PM IST
The Previous Government Did Injustice To The Unemployed In Telangana Says Venkat Balmoor
X

Venkat Balmoor: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజుల్లో.. TSPSC ప్రక్షాళన చేశాం

Venkat Balmoor: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామన్నారు ఎమ్మెల్సీ బల్మూరీ వెంకట్. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మేము న్యాయం చేస్తున్నాము. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. జీవో-3 పై కవిత మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో వలన నిరుద్యోగులకు, మహిళలకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మూడు రోజులలోనే TSPSC ప్రక్షాళన చేశామని..జాబ్ కేలండర్ తొందరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story