Khammam: ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఉద్రిక్తత

Khammam: దాడి చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shashank Gullapelli
Published on: 31 March 2024 5:36 PM IST
The Police Arrested The Attacking Tribals
X

Khammam: ఖమ్మం జిల్లా బుగ్గపాడులో ఉద్రిక్తత

Khammam: ఖమ్మం జిల్లా బుగ్గపాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రయపాలెం, బుగ్గపాడు పోడు సాగుదారులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు రంగంలోకి దిగిన పోలీసులపై గిరిజనులు తిరగబడ్డారు. అనంతరం పోలీసులు బుగ్గపాడు గ్రామానికి చేరుకుని తమపై దాడిచేసిన గిరిజనులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో గిరిజనులు పోలీసులను అడ్డుకునే క్రమంలో ఘర్షణ తలెత్తింది. దీంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తమను బలవంతంగా అరెస్టు చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story