SLBC: టన్నెల్ లోపల ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ రింగ్ అయ్యింది..ఎలాగైనా బయటకు తెస్తామనే నమ్మకం ఉంది

SLBC: టన్నెల్ లోపల ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ రింగ్ అయ్యింది..ఎలాగైనా బయటకు తెస్తామనే నమ్మకం ఉంది
x
Highlights

SLBC: ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని..టెన్నల్ లో చిక్కుకున్న కార్మికులను ఎలాగైనా బయటకు తెస్తామనే నమ్మకం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.

SLBC

ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని..టెన్నల్ లో చిక్కుకున్న కార్మికులను ఎలాగైనా బయటకు తెస్తామనే నమ్మకం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. లోపల ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ రింగ్ అయ్యిందన్నారు. అక్కడ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. ఘటన జరిగిన రోజు ఆయన తన భార్యతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. మేము ఆయన ఫోన్ కు కాల్ చేయగా మొదట రింగ్ అయ్యి..తర్వాత స్విచ్చాఫ్ అయ్యిందన్నారు. సైబర్ సెక్యూరిటీ సహాకారంతో ఫోన్ ట్రేస్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సోమవారం టన్నెల్ దగ్గర ప్రకాశ్ సంస్థ క్యాంప్ కార్యాలయంలో రాబిన్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్స్ ఎక్స్ పర్ట్ ఇంజనీర్ క్రిస్ కూపర్ తో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఇందులో డిజాస్టర్ మేనేజ్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు, జయ్ ప్రకాశ్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories