ఆదిలాబాద్ అడవుల్లో అలజడి!

ఆదిలాబాద్ అడవుల్లో అలజడి!
x
Highlights

అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి. పక్షుల రాగాల సందడి పోయి పోలీసుల బూట్ల చప్పుళ్లు గుబులు పుట్టిస్తున్నాయి. మావోల ఉనికి...

అడవుల ఖిల్లా ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు వేడెక్కాయి. పక్షుల రాగాల సందడి పోయి పోలీసుల బూట్ల చప్పుళ్లు గుబులు పుట్టిస్తున్నాయి. మావోల ఉనికి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎప్పుడేం ఏం జరుగుతుందో అని ఆదివాసులు టెక్షన్ పడుతున్నారు. మావోల కోసం పోలీసులు అణవణువు గాలిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. మరీ డ్రోన్ కెమెరాల్లో ఏం రుజువైంది. మావోలు తప్పించుకున్నారా పోలీసులకు చిక్కారా. కుమ్రంభీమ్ జిల్లాలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

కుమ్రంభీమ్ జిల్లా కదంబ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ మరోసారి అలజడి సృష్టించింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు సుక్కాలు, బాజీరావు ప్రాణాలు విడిచారు. కుమ్రంబీమ్, మంచిర్యాల జిల్లాల కార్యదర్శి భాస్కర్, కమిటీ సభ్యులు వర్గీస్, రాము, అనిత త్రుటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోలను పట్టుకునేందుకు పోలీసులు సీరియస్ గా యత్నిస్తున్నారు. ఇరవై గ్రేహౌండ్స్ పార్టీలు, ‌మరో 5వందల స్థానిక పోలీసులతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా బెజ్జూర్‌, కాగజ్‌నగర్‌, చింతల మానేపల్లి, సిర్పూర్ యూ, దహేగామ్ మండలాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా పోలీసులు అన్వేషిస్తున్నారు. దీంతో కాగజ్ నగర్ డివిజన్ పోలీసు బూట్ల చప్పుళ్లతో దద్ధరిల్లుతోంది. ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో మావోలు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి మావోలు చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర పారిపోయే అవకాశాలున్నాయని పోలీసుల అంచనా. అయితే వారి కదలికలను తెలుసుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల నిఘా పెంచారు.

అయితే పదిరోజుల నుంచి డ్రోన్ కెమెరాలతో పరిశీలించినా పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. అనుమానం వచ్చినా ప్రాంతాలను రికార్డు చేసి, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కానీ ఎక్కడ మావోల కదలికలు రికార్డు కాలేదు. అయితే ఎన్ కౌంటర్ తర్వాత మావోలు చత్తీస్‌ ఘడ్ దండకారణ్యం పారిపోయారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు పోలీసులు. మావోయిస్టు నాయకుడు భాస్కర్ ఈ అడవుల్లోనే తలదాచుకున్నట్లు పోలీసులు పక్కగా భావిస్తున్నారు. ఆరునూరైన మావోలను పట్టుకొని తీరుతామని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల వేటను సవాల్ గా తీసుకున్న మావోలు వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారని మావోయిస్ట్ వర్గాలు అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories