Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం

Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం
x
Highlights

యోగ అనేది ఒక సంస్కృత పదం నుంచి పుట్టింది. ఒకప్పటి కాలంలో యోగ సాధన చేసే వాళ్ళను యోగులు అనేవారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె...

యోగ అనేది ఒక సంస్కృత పదం నుంచి పుట్టింది. ఒకప్పటి కాలంలో యోగ సాధన చేసే వాళ్ళను యోగులు అనేవారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహించేవారు. ఈ ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. యోగలో వేసే ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని పెంచుతుంది. దీంతో ఒకప్పుడు ఎంతో ప్రాముఖ్యత గాంచిన యోగ సాధనను ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రతి పట్టణంలో, ప్రతీ ఏరియాలో యోగా కేంద్రాలను స్థాపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోణంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద యోగా కేంద్రాన్ని పతంజలి వారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసారు.

ఈ ధ్యాణ మందిరాన్ని 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు. ఈ ఆశ్రమంలో ఒకేసారి లక్ష మంది అభ్యాసీలు సహజ మార్గ్‌ పద్ధతిలో ధ్యానం చేసే అవకాశం ఉంటుంది. దేశంలోనే ఇంత పెద్ద ధ్యాన మందిరాన్ని నిర్మించడానికి రెండేళ్ల క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శంకుస్థాపన చేశారు. దీంతో పాటుగానే ఈ కేంద్రం 8 ఉప కేంద్రాలను కూడా తాబేలు ఆకారంలో నిర్మించారు. 1400 ఎకరాల్లో 40 వేల మందికి పైగా బసచేసేందుకు వసతి సైతం ఏర్పాటు చేశారు. దాంతో పాటుగానే వచ్చిన వారికి ఆహారం అందించడానికి వంటచేసే వంట గదులనూ నిర్మించారు.

కాగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన చేసిన ఈ యోగా కేంద్రాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు ఎంతో వైభవంగా ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగా గురుజి బాబారాందేవ్‌తో పాటు మిషన్‌ గురూజీ కమలేశ్ డి. పటేల్‌ (దాదాజీ) ప్రపంచ వ్యాప్తంగా 40 వేల మంది అభ్యాసీలు పాల్గొననున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం కన్హ ఆశ్రమాన్ని హార్ట్‌ ఫుల్‌నెస్‌ సంస్థ గ్లోబల్‌ హెచ్‌ క్వార్డర్‌గా ప్రకటించనున్నారు యోగా గురువులు.

ఇకపోతే 1945లో అప్పటి గురూజీ బాబూజీ మహరాజ్‌ శ్రీరామచంద్ర మిషన్‌ ను ఉత్తర్‌ ప్రదేశ్‌‌లో ప్రారంభించారు. ఆ మిషన్ ప్రారంభించిన నాటినుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 5 వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఏర్పడ్డాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ ఈ కేంద్రాలలో లక్షల మందిలో అభ్యాసీలు ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్న ప్రజలు ఒత్తిడిని జయించేందుకు సహజ మార్గ్‌ పద్ధతిలో ధ్యానం చేయించేందుకు ఎందరో అభ్యాసీలు ఈ కేంద్రాలలో స్వచ్ఛందంగా ముందుకు వస్తూ అభ్యాసీల సంఖ్యను పెంచుతున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాలో ఆశ్రమం ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి ఇక్కడికి వచ్చే అభ్యాసీలకు మూడు విడతలుగా వసంతోత్సవాలను ఏర్పాటు చేశారు. ఈనెల 28 నుంచి 30 వరకూ, మళ్లీ ఫిబ్రవరి 2 నుంచి 4, తర్వాత అదే నెల 7నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను దాదాపుగా లక్షకు పైగా అభ్యాసీలు రానున్నట్లు తెలిపారు. ఇక ఈ యోగా కేంద్రానికి చేరుకునేందుకు హైదరాబాద్‌లో నుంచి పలు డిపోల బస్సులు ఆశ్రమానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దాంతోపాటు విమానాశ్రయం, రైల్వేస్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.



.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories