Telangana: రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20న రాత్రి కర్ఫ్యూపై ఇచ్చిన జీవోను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నామని ఏజీ హైకోర్టుకు తెలిపారు.

Arun Chilukuri
Updated on: 30 April 2021 5:06 PM IST
Telangana: రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు
X

Telangana: రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు


Telangana: తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20న రాత్రి కర్ఫ్యూపై ఇచ్చిన జీవోను మరో వారం రోజుల పాటు పొడిగిస్తున్నామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో ఇంకా ఏమైనా ఎన్నికలు ఉన్నాయా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఎన్నికలు లేవని కోర్టుకు ఏజీ తెలిపారు. ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తెలపకపోయినట్లయితే పరిస్థితి.. వేరేలా ఉండేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు.. హైకోర్టు సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ఇక నుంచి అయినా కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story