Krishna Sagar Rao: ప్రభుత్వ చేతగానితనమే హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు

Krishna Sagar Rao: డ్రగ్స్ దందాతో హైదరాబాద్ సంస్కృతి మసకబారుతోంది

Jyothi
Updated on: 5 April 2022 12:49 PM IST
The Government Must Answer To The People on Drug Dealing
X

Krishna Sagar Rao: ప్రభుత్వ చేతగానితనమే హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు

Krishna Sagar Rao: డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి క్రిష్ణసాగర్ రావు ధ్వజమెత్తారు. డ్రగ్స్ దందాతో హైదరాబాద్ సంస్కృతి మసకబారుతోందని ఆయన విచారం వ్యక్తంచేశారు. మాదక ద్రవ్యాలు విద్యాసంస్థలకు సరఫరా, పబ్ నిర్వహణ ముసుగులో డ్రగ్స్ దందా ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. నైట్ లైఫ్ ముసుగులో మాదకద్రవ్యాల వినియోగానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ముమ్మాటికీ కారణమన్నారు.

ప్రభుత్వ ప్రతినిధుల చేతగానితనానికి నిదర్శనమన్నారు. సామాజిక సమస్య ఉత్పన్నమైనపుడు పరిష్కారమార్గం చూడకుండా... ప్రతిపక్షపార్టీలను ఆడిపోసుకోవడం మంచిది కాదని ఆయన సూచించారు. గొప్ప సంస్కృతి, చరిత్రగల హైదరాబాద్ పేరు మసకబారనీకుండా పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు

Jyothi

Jyothi

Next Story