Hyderabad: ప్రమాదంలో చార్మినార్‌ భవితవ్యం

The Future of Charminar in Danger
x

హైదరాబాద్ చార్మినార్ (ఫైల్ ఫోటో)

Highlights

Hyderabad: 430 ఏళ్ల కట్టడానికి బీటలు * చార్మినార్‌కు పెచ్చులూడటంతో ఆందోళన

Hyderabad: భాగ్యనగర షాన్..‌ మన హైదరాబాద్‌ సంతకం ఈ చారిత్రక నగరానికి తలమానికంగా విరాజిల్లుతున్న చార్మినార్‌ భవితవ్యం ప్రమాదంలో పడింది. 430 ఏళ్ల కట్టడం బీటలు వారుతుంది. అంతేకాదు అక్కడక్కడా పెచ్చులు ఊడుతూ ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు ఆరునెలలుగా చార్మినార్‌కి మరమ్మత్తులు చేపట్టిన అది త్వరితగతిన పూర్తికావడం లేదు. అతిపురాతనమైన కట్టడాన్ని కాపాడాలని పర్యాటకులు కోరుతున్న

కులీ కుతుబ్‌షాహి 1591లో చార్మినార్‌ను నిర్మించారు. చెప్పాలంటే. 430ఏళ్ల కిత్రంనాటి కట్టడం కావడంతో చార్మినార్‌ కొంత బలహీనపడింది. అయినప్పటికీ లోపల రాతి నిర్మాణాలు ఉండటంతో ఇప్పటికీ కొంతమేర పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్‌కు అతి చేరువగా సంచరిస్తుండటం. ఈ కట్టడం బలహీనపడటానికి కారణమైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, రేగుతున్న ధూళి కణాలు చార్మినార్‌ కట్టడం పటుత్వం దెబ్బతినేలా చేశాయి.

విషవాయువులు, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, ధూళికణాలు అన్నీ కలిపి కట్టడం గోడలపై పూతలాగా ఏర్పడ్డాయి. అయితే డంగు సున్నం, కరక్కాయ పొడి, నల్లబెల్లం, రాతిపొడి, గుడ్డు సొన మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించారు. ప్రధాన కట్టడం రాతిదే అయినా దానిపైనా ఈ మిశ్రమాన్ని మందంగా ఏర్పాటు చేశారు. ఇవి తడిని పీల్చుకోవు. కానీ సందర్శకులు చార్మినార్‌ గోడలపై లోతుగా పేర్లు చెక్కుతున్నారు. ఫలితంగా రాతి కట్టడం బలహీన పడిందని నిపుణులు గుర్తించారు.

మరోవైపు కేంద్ర పురావస్తు సర్వేక్షణ శాఖ అధికారులు గోడలకు కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ చేసి సంప్రదాయ మిశ్రమంతో దెబ్బతిన్న భాగాలను సరి చేస్తున్నారు. అయితే చార్మినార్‌ను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందంటున్న పర్యాటకులు వెంటనే నిధులు మంజూరు చేసి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. అతి పురాతన చరిత్ర కల్గిన కట్టడాలు సమర్శించడం వల్ల రేపటి భవిష్యత్‌ తరానికి దాని వైభవం తెలుస్తుందన్నారు.

ఏదీ ఏమైనా చారిత్రక ప్రాంతాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ముఖ్యంగా చార్మినార్‌ని ప్లేగు వ్యాధి నిర్ములనకు గుర్తుగా ఆరోజు కులీ కుతుబ్‌షాహి నిర్మించారు. ఇక ఇప్పటికైనా పెచ్చులూడుతున్న చార్మినార్‌కి మరిన్ని నిధులు కేటాయించి రేపటి భవిష్యత్‌ తరానికి చార్మినార్‌ వైభవం తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories