Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రక ఘట్టం

Pawan Kalyan: రాష్ర్ట సాధనలో అసువులు బాసిన వీరులకు వందనాలు, ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ

Jyothi
Published on: 2 Jun 2022 6:34 AM IST
The Emergence of Telangana is A Historic Event
X

Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రక ఘట్టం

Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రక ఘట్టమని.. ప్రజలంతా ముక్త కంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ విజయం కోసం ఎంతో మంది ప్రాణాలు ధారబోశారని.. మరెందరో తమ జీవితాలను అర్పించారని.. వారి త్యాగాల ఫలితమే నేటి మన తెలంగాణ రాష్ట్రమని పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణ అవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా జనసేన పక్షాన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వీరులకు వందనాలు తెలిపారు. ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ అని.. పాలకుల అణిచివేత దాష్టికాలను ఎదిరించే లక్షణం ఈ నేల సొంతమన్నారు. పోరాడితేనే లక్ష్యం సిద్ధిస్తుందని ఎలుగెత్తి చాటింది తెలంగాణ ఉద్యమమని కొనియాడారాయన.

Jyothi

Jyothi

Next Story