Gutha Sukender Reddy: మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ ఎన్నిక ఏకగ్రీవమే

Gutha Sukender Reddy: మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ ఎన్నిక ఏకగ్రీవమే

Rama Rao
Updated on: 14 March 2022 8:45 AM IST
The Election of Gutta Sukhender as the Chairman of the Legislative Council was Unanimous
X

మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ ఎన్నిక ఏకగ్రీవమే

Gutha Sukender Reddy: శాసనమండలి ఛైర్మన్‌గా మాజీ ఛైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఎన్నికల అధికారి శాసనసభ కార్యదర్శికి ఆదివారం ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. పలువురు ఎమ్మెల్సీలు సుఖేందర్‌రెడ్డి తరఫున నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. గడువు ముగిసేలోగా ఈ పదవికి ఒకే నామినేషన్ దాఖలైంది. రెండోసారి ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది.

ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనమండలిలో ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికైన వెంటనే గుత్తా సుఖేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రెండోసారి అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్‌లకు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. తమను బలపర్చిన అన్ని పార్టీల శాసనమండలి సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story