Hyderabad: ఇంటి ముందు ఆడుకుంటున్న పాపను తీవ్రంగా గాయపరిచిన కుక్కలు

Hyderabad: కుక్కల దాడిలో పాప రుష్మిత ముఖంపై తీవ్రగాయాలు

Shashank Gullapelli
Published on: 17 March 2024 9:38 PM IST
The Dogs Seriously Injured The Baby Was Playing In Front Of The House
X

Hyderabad: ఇంటి ముందు ఆడుకుంటున్న పాపను తీవ్రంగా గాయపరిచిన కుక్కలు

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి వీధి కుక్కలు హల్‌చల్ చేశాయి. మేడ్చల్ పరిధిలో మూడు చింతలపల్లి మండలం అద్రాస్‌పల్లిలో చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఇవాళ సెలవుదినం కావడంతో రుష్మిత సాయి అనే పాప ఇంటిముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా దూసుకొచ్చిన కుక్కలు చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో రుష్మిత ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టారు. అనంతరం పాపను చికిత్స నిమిత్తం నారాయణగూడలోని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story