KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పకూలడం ఖాయం

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు

Shashank Gullapelli
Published on: 26 April 2024 9:53 AM IST
The Congress Government Is Sure To Collapse With In The Year Says KTR
X

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పకూలడం ఖాయం

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంలో కుప్పకూలడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రెండు లక్షల రుణ మాఫీ, పేదల వివాహాలకు తులం బంగారం, రైతులకు 24 గంటల కరెంట్, ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ, రాష్ట్రంలో ఉన్న రేవంత్‌రెడ్డి ఇద్దరు బడే భాయి, ఛోటే భాయిలని అభివర్ణించారు. తాము ఎన్నడూ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుటపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ తరపున నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ మాట్లాడారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story