Harish Rao: మళ్లీ మోడీ ప్రధాని అవుతారని సీఎం పరోక్షంగా అన్నారు.. రాహుల్ దేశ ప్రధాని కాడు అనేగా

Harish Rao: 3నెలల్లో 16వేలకోట్ల అప్పు చేశారు

Shashank Gullapelli
Published on: 6 March 2024 4:42 PM IST
The CM Revanth Reddy Indirectly Said That Modi Will Become The Prime Minister Again Says Harish Rao
X

Harish Rao:మళ్లీ మోడీ ప్రధాని అవుతారని సీఎం పరోక్షంగా అన్నారు.. రాహుల్ దేశ ప్రధాని కాడు అనేగా

Harish Rao: గుజరాత్ మోడల్ తెలంగాణలో కావాలని సీఎం రేవంత్‌ అంటున్నారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. మళ్లీ మోడీ ప్రధాని అవుతారని సీఎం పరోక్షంగా అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే... మోడీ సహాయ సహకారాలు, ఆశీర్వాదం ఎందుకు అని ప్రశ్నించారు. రాహుల్ దేశ ప్రధాని కాడు అనేగా రేవంత్ చెప్పేదన్నారు. 6 గ్యారెంటీ లో 13 అమలు చేస్తే నే పార్లమెంట్ ఎన్నికలో ఓటు అడిగే నైతికత సీఎంకు ఉంటుందని చెప్పారు. 3నెలల్లో 16వేలకోట్ల అప్పు చేసారన్నారు.

రేవంత్ రెడ్డి మోడీ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో .. అంట కాగుతున్నారని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పనులు కోసమే సీఎంను కలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షనేత కేసీఆర్ సరైన సమయంలో స్పందిస్తారన్నారు హరీష్‌రావు

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story