తెలంగాణ చరిత్రలో ఉద్విగ్న ఘట్టం.. అమరులకు క్యాండిల్‌తో నివాళి అర్పించిన సీఎం

The CM KCR paid tribute to the immortal with a candle
x

తెలంగాణ చరిత్రలో ఉద్విగ్న ఘట్టం.. అమరులకు క్యాండిల్‌తో నివాళి అర్పించిన సీఎం

Highlights

CM KCR: అమరవీరుల కుటుంబాలను సత్కరించిన సీఎం కేసీఆర్‌

CM KCR: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు.. భావితరాలకు స్ఫూర్తిని నింపేలా నిర్మించిన అమరుల స్మృతి మందిరం ప్రారంభమైంది. అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ఉద్యమ నేపథ్యానికి సాక్ష్యంగా నెలకొల్పిన అమర జ్యోతి వెలిగింది.

అమరుల స్మారకం దగ్గరకు సీఎం చేరుకున్న అనంతరం.. పోలీసులు అమరులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్మారక మందిరాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన అమరుల చిహ్నానికి నివాళులర్పించారు. అనంతరం మినీ థియేటర్ లో ఉద్యమ నేపథ్య వీడియోను మంత్రులతో పాటు వీక్షించారు. ఇక కాసేపట్లో స్మారక మందిరంపై ఏర్పాటు చేసిన అమర జ్యోతిని వెలిగించారు. అనంతరం క్యాండిళ్లు వెలిగించి అమరులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలను సత్కరించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories