Kavitha: తెలంగాణకు బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిందేమీ లేదు

Kavitha: బడ్జెట్‌లో భవిష్యత్‌పై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదు

Dhatripriya
Published on: 1 Feb 2023 3:59 PM IST
The Center has not given anything in the budget to Telangana
X

Kavitha: తెలంగాణకు బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిందేమీ లేదు

Kavitha: తెలంగాణతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాలకు బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చిందేమీ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. సబ్‌ కా సాత్‌ అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయలేదన్నారు. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీకి 2025 వరకు పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్‌, ఇతర సెజ్‌ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో భవిష్యత్‌పై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. బడ్జెట్‌ను మోడీ అంకెల గారడీగా కవిత అభివర్ణించారు. కరోనా సమయంలో ఎంఎస్‌ఎంఈలకు 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోడీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story