వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం

*దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసే దిశగా చర్యలు 15 రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌లు, కో ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన బీజేపీ

Rama Rao
Updated on: 9 Sept 2022 7:45 PM IST
The BJP leadership is focused on the upcoming elections
X

వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం

BJP: వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన బీజేపీ...అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతోంది. దాదాపు 15 రాష్ట్రాలకు తాజాగా ఇన్‌చార్జీలను, కో ఇంచార్జీలను ప్రకటించింది పార్టీ అధిష్టానం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో వీరిని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండాను ఎగరేయాలన్న లక్ష్యంతో పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ బీజేపీ ఇంచార్జీగా తరుణ్ చుగ్, కో ఇంచార్జీగా అరవిందు మీనన్‌ను నియమించింది పార్టీ అధిష్టానం.

Rama Rao

Rama Rao

Next Story