RS Praveen Kumar: తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది

RS Praveen Kumar: *దుబ్బాకలో స్వేరోస్ ఆధ్వర్యంలో రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర దొరల గడీలను కూల్చడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు పని చేయాలి.

Sriveni Erugu
Published on: 4 April 2022 7:31 AM IST
The Bahujan kingdom will come in Telangana
X

RS Praveen Kumar: తెలంగాణలో బహుజన రాజ్యం వస్తుంది

RS Praveen Kumar: రాబోయో రోజుల్లో తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుందన్నారు బహుజన సమాజ్ పార్టీ నేత డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్. స్వేరోస్ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార సంకల్ప సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా దుబ్బాకలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దుబ్బాక బస్ డిపో సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. స్వేరోసే యూనియన్ మాత్రమే బహుజన రాజ్యాధికార లక్ష్యంగా పని చేస్తుందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న దోపిడీని ఇంటింటికి పరిచయం చేస్తున్న స్వేరోస్ యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. బిసి, ఎస్సీ, ఎస్టీ అందరూ కలిసి రాబోయే రోజుల్లో దొరల గడీలను కూల్చడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story