బీఆర్ఎస్‌లోకి తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ.. ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ..!

Thatikonda Rajaiah: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Arun Chilukuri
Published on: 29 March 2024 3:59 PM IST
బీఆర్ఎస్‌లోకి తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ.. ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ..!
X

బీఆర్ఎస్‌లోకి తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ.. ఇవాళ సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ..!

Thatikonda Rajaiah: బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం గులాబీ బాస్ కేసీఆర్‌తో రాజయ్య సమావేశంకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో గులాబీ పార్టీకి రాజీనామా చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు కూడా చేశారు.

అయితే ఆయన రాజీనామాను కేసీఆర్ ఆమోదించలేదు. మరోవైపు అనూహ్యంగా వరంగల్ ఎంపీ స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. తండ్రితో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఎంపీ సీటు ఖాళీ కావడంతో మళ్లీ బీఆర్ఎస్ నేతలతో టచ్‌లోకి వెళ్లారు తాటికొండ రాజయ్య. ఇక వరంగల్ ఎంపీ టికెట్‌ను నిరాకరించిన కావ్య స్థానంలో రాజయ్యను బరిలో దించాలని బీఆర్ఎస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story