TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె వాయిదా

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె వాయిదా
x

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె వాయిదా

Highlights

TGSRTC Strike: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది.

TGSRTC Strike: ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రెండు రోజులుగా వివిధ సంఘాలతో మంత్రి పొన్నం సమ్మె విరమించాలంటూ కార్మిక సంఘాలను కోరారు. ‎

ఇవాళ ఆర్టీసీ జేఏసీ సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నంతో భేటీ అయింది. చర్చలు సఫలం కావడంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా సమ్మెను విరమించుకుంటున్నట్టు జేఏసీ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. లోకేష్ కుమార్, నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్ తో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories