TGSRTC: ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన..!

TGSRTC on Cargo Services: ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2024 6:45 AM IST
TGSRTC Cargo Home Delivery Services From Today in Hyderabad
X

TGSRTC: ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన..!

TGSRTC on Cargo Services: ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కార్గోలో బుక్ చేసిన వస్తువులను వినియోగదారులకు ఇంటి వద్దకే అందించే సౌకర్యం కల్పిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇవాళ్టి నుంచి హైదరాబాద్ నుంచి హోండెలివరికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

హైదారాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోండెలివరి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్స్ నుంచి హైదారాబాద్ లో ఎక్కడికైనా హోండెలివరి చేయవచ్చని చెప్పారు. రాబోయో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హోం డెలివరి సేవలు అందించే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలు హోండెలివరి సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story