TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు విచారణ

TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లను ఇవాళ కూడా హైకోర్టు విచారించనుంది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 11:44 AM IST
TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు విచారణ
X

TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు విచారణ

TGPSC Group-1 Case: TGPSC గ్రూప్-1 పిటిషన్లను ఇవాళ కూడా హైకోర్టు విచారించనుంది. ఇప్పటికే టీజీపీఎస్సీతో పాటు గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థుల వాదనలు ముగిశాయి. ఇవాళ కూడా ప్రతివాదుల తరఫున వాదనలు కొనసాగనున్నాయి. గ్రూప్-1పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈవాల్యుయేషన్ పాదర్శకంగా జరిగినట్లు TGPSC పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికకాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు వేశారని, వాటిపై ఇరుపక్షాల వాదనలు విన్న సింగిల్ బెంచ్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎంపిక లిస్టును రద్దు చేసిందన్నారు. కాగా.. టీజీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలోనే పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో తేడాలున్నట్లుగా పలు అనుమానాలకు తావిస్తోందని ప్రతివాదుల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story