TG GURUKUL CET: జులై 18న గురుకుల ప్రవేశపరీక్ష

TG GURUKUL CET: తెలంగాణ రాష్ట్ర గురు‌కుల విద్యా‌ల‌యాల సంస్థ 2021–22 విద్యా సంవ‌త్సరంలో ఐదో తర‌గతి ప్రవే‌శాల పరీక్ష తేదీ ఖరారైంది.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 10:53 AM IST
TGCET 5th Class Entrance Test would be conducted on 18th July
X

TG GURUKUL CET: జులై 18న గురుకుల ప్రవేశపరీక్ష

TG GURUKUL CET: తెలంగాణ రాష్ట్ర గురు‌కుల విద్యా‌ల‌యాల సంస్థ 2021–22 విద్యా సంవ‌త్సరంలో ఐదో తర‌గతి ప్రవే‌శాల పరీక్ష తేదీ ఖరారైంది. బీసీ, సాంఘిక, గిరిజన, ఇతర గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన వీటీజీ సెట్‌-2021 జూలై 18న జరగనుంది. జులై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామని, వారం ముందు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు. మే 30న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి టీజీ సెట్ రాసేందుకు అర్హులన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story