బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ట్విస్ట్.. కేసులో A5గా టీజీ వెంకటేష్‌ పేరు

TG Venkatesh Booked in Land Grabbing Case in Banjara Hills
x

బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ట్విస్ట్.. కేసులో A5గా టీజీ వెంకటేష్‌ పేరు

Highlights

AP Gems and Jewellery Park: హైదరాబాద్ బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

AP Gems and Jewellery Park: హైదరాబాద్ బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 58 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏ5 గా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ పేరు చేర్చారు. అలాగే టీజీతోపాటు విశ్వ ప్రసాద్, సుభాష్ పులిశెట్టి, మిథున్ కుమార్, వీవీ ఎస్ శర్మతోపాటు మరో 80 మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ ఏపీ జేమ్స్ అండ్ జ్యూవలర్స్ పై దాడులకు యత్నించినట్లు నిర్ధారించారు. జేసీబీలతో ఏపీ జేమ్స్ సంస్థను ద్వంసం చేసేందుకు ప్లాన్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూళాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు హాకీ స్టిక్స్, 70 చేయిర్లు, ఫుడ్ ప్యాకెట్స్ తో 80 మంది లోనికి ప్రవేశించేందుకు యత్నించినట్లు తేల్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories