Hyderabad: రాచకొండ కమిషనరేట్‌ పాతబస్తీలో వరుస హత్యలు

Hyderabad: రాచకొండ కమిషనరేట్‌ పాతబస్తీలో వరుస హత్యలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లోని మొన్న షాహిన్‌ నగర్‌లో రౌడీషీటర్‌ అమేర్‌ హత్య మరువకముందే.. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముర్షీద్‌ అలం అనే వ్యాపారి హత్య కలకలం రేపింది. అబ్దుల్లా అనే వ్యక్తి ముర్షీద్ అలంను కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కకడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు భర్మా దేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిందితుడు అబ్దుల్లా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories