Vikarabad: వికారాబాద్ తాండూర్‌లో టెన్షన్ టెన్షన్

Tension in Vikarabad Tandoor | TS News
x

Vikarabad: వికారాబాద్ తాండూర్‌లో టెన్షన్ టెన్షన్

Highlights

Vikarabad: ఇప్పటివరకూ లభ్యం కాని అన్నపూర్ణ ఆచూకీ

Vikarabad: వికారాబాద్ జిల్లాకు చెందిన సత్యమూర్తి తన భార్య కోసం పోలీసులకు విధించిన డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది. తన భార్యను పోలీసులు ఎలాగైనా పట్టుకుని తిరిగి తీసుకురావాలని తాండూరుకు చెందిన సత్యమూర్తి సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ చేశారు. లేదంటే సూసైడ్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతను విధించిన 48 గంటల డెడ్‌లైన్ ఇవాళ్టితో ముగిసింది.

పోలీసులు తన భార్య మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, తన కేసును పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురయ్యాడు సత్యమూర్తి. శుక్రవారం రాత్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సెల్ఫీ వీడియో తీశారు. ఈ సెల్ఫీ వీడియోలో 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనుక్కోవాలని, లేదంటే పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటానని డెడ్‌లైన్ విధించారు. తన భార్య లేకుండా తాము బ్రతకలేమని సత్యమూర్తి పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుక్రవారం రాత్రి రెండు గంటల నుండి సెల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన దొరిశెట్టి సత్యమూర్తి, భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం BSP జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. భార్య అన్నపూర్ణ మార్చి 6వ తేదీన ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీనిపై సత్యమూర్తి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అన్నపూర్ణ ఆచూకీ కోసం సత్యమూర్తి కుటుంబం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆమెను కనిపెట్టిన లేదా ఆమె గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తికి 5 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు.

ఇక కనిపించకుండా పోయిన సత్యమూర్తి, తన పిల్లల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేంద్రరెడ్డి నేతృత్వంలో సీపీ ఫుటేజ్ ఆధారంగా సత్యమూర్తి తన పిల్లలతో కలిసి పరిగి, షాద్‌ నగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని విమానంలో ముంబై వెళ్లినట్లు గుర్తించారు. ముంబైలో సత్యమూర్తి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను పంపించి గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories