కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. పటేల్ రమేష్ రెడ్డి ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణం

Patel Ramesh Reddy: సూర్యాపేట నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్

Jyothi
Published on: 15 Nov 2023 12:15 PM IST
Tension in Suryapet Constituency
X

 కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌.. పటేల్ రమేష్ రెడ్డి ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణం

Patel Ramesh Reddy: సూర్యాపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సూర్యాపేట నుంచి రెబల్ నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డితో నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరడానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిని, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవిని పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో పటేల్ రమేష్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతల ఎదురుగానే... సింహం గుర్తుకే తమ ఓటు అంటూ... నినాదాలు ఇచ్చారు పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు. కాగా.. రెబల్ గా నామినేషన్ వేసిన రమేష్ రెడ్డిని ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని రోహిత్ చౌదరి కోరారు.

Jyothi

Jyothi

Next Story