Uppal: హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత

Uppal: ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణ

Shashank Gullapelli
Published on: 25 April 2024 1:06 PM IST
Tension In Front Of Hyderabad Uppal Cricket Stadium
X

Uppal: హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత

Uppal: హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. ఐపీఎల్ టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్‌లో విక్రయిస్తోందంటూ ఆరోపించారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురిచేస్తోందన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story