ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేతల ఘర్షణ

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వివాదం జరిగింగి.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 5:20 PM IST
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేతల ఘర్షణ
X

ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేతల ఘర్షణ

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వివాదం జరిగింగి. పదవులు లేని వారిని స్టేజిపై కూర్చోబెట్టారని.. కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవులు లేని వారి పేర్లు ప్రసంగంలో తీసుకోవటంతో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు ఇరువర్గాల నేతలు. జోక్యం చేసుకున్న పోలీసులు... నేతలకు సర్దిచెప్పి పంపారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ నేతలు ఫిర్యాదులు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story