రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

Ranga Reddy: సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్‌, టోల్‌ సిబ్బందికి మధ్య గొడవ

Jyothi
Published on: 21 Sept 2022 1:46 PM IST
Tension at Shadnagar Toll Plaza in Ranga Reddy District
X

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత

Ranga Reddy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్‌ చెల్లింపు విషయంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్‌, టోల్‌ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ప్రణీల్‌ అనుచరులు.. టోల్‌ బూత్‌ అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో టోల్‌ సిబ్బందితో పాటు.. ప్రణీల్‌ అనుచరులు కూడా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. గాయాలైనవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Jyothi

Jyothi

Next Story