Jagtial: కరోనాను జయించిన 10 నెలల చిన్నారి

Jagtial: గత నెల తల్లి రాధికకు, చిన్నారి ఆరాధ్యకు కరోనా పాజిటివ్

Sandeep Eggoju
Updated on: 20 May 2021 3:53 PM IST
Ten Monthes Old Baby Recovered From Corona In Jagtial District
X

Representational Image

Jagtial: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పది నెలల చిన్నారి కరోనాను జయించింది. వర్షకొండ గ్రామానికి చెందిన వేముల ఆనంద్‌, రాధిక దంపతులకు పది నెలల కుమార్తె ఆరాధ్య ఉంది. గత నెల తల్లి రాధికకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్నారి ఆరాధ్యకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో వైద్యుల సూచనలతో తల్లిదండ్రులు తీసుకున్న జాగ్రత్తలు, వైద్యాధికారుల కృషితో చిన్నారి కరోనాను జయించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story