PM Rozgar Mela: 10 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు.. అక్రమాలకు తావు లేకుండా నియామకాలు

PM Rozgar Mela: రాష్ట్రప్రభుత్వ భర్తీల్లో అనేక అవకతవకలు జరుగుతాయన్న కిషన్‌రెడ్డి

Dhatripriya
Published on: 16 May 2023 3:21 PM IST
Ten Lakh Jobs In 10 Months Without Irregularities
X

PM Rozgar Mela: 10 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు.. అక్రమాలకు తావు లేకుండా నియామకాలు 

PM Rozgar Mela: యువత‌కు విస్తృతంగా ఉపాధి కల్పన కోసమే ప్రధాని మోదీ నాయకత్వంలో రోజ్ గార్ మేళా నిర్వహిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి భగవత్ కిషన్ వెల్లడించారు. హైదరాబాద్ లో రోజ్ గార్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగే ఉద్యోగాల భర్తీలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఉద్యోగాల భర్తీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. వీటి భర్తీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎంపికైన అభ్యర్థులకు ప్రధాని మోదీయే రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తున్నారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story