Weather Report: దక్షిణాదిన దంచికొడుతున్న ఎండలు

Temperatures Are Increasing Day By Day
x

Weather Report: దక్షిణాదిన దంచికొడుతున్న ఎండలు 

Highlights

Weather Report: ఉదయం 11 గంటలకే 45 డిగ్రీలకు చేరుకుంటున్న టెంపరేచర్

Weather Report: ద‌క్షిణాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓవైపు.. ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జనాలను ఎండ వేడికి ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవసరమైతేనే బయటికి రావాలని.. వాతావరణ శాఖ సూచిస్తోంది. రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలో వేడిగాలుల వీస్తాయని.. కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి, జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది.

ఎండ వేడిమికి అల్లాడుతున్న సాధారణ జనాలు ఓవైపు అయితే... సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి జనాలు రాక.. పార్టీల నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి... పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ... ప్రచారాలు ముమ్మరం చేయాల్సిన సమయంలో.. ఎండ వేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. వీలైనంత వరకూ పార్టీలు సైతం.. ఉదయం.. సాయంత్రం మాత్రమే ప్రచారాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.

సౌత్ మొత్తంలో కేర‌ళ‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు న‌మోదు అవుతున్నాయి. కేర‌ళ‌లో హీట్‌వేవ్ ఎక్కువ‌గా ఉండటంతో.. పాలక్కాడ్‌, మ‌ల‌ప్పురం, అల‌ప్పుజా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు ఓట‌ర్లు మృతిచెందారు. ఎండ వేడి త‌ట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్‌లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతిచెందాడు. 48 డిగ్రీలు ఎండ, వేడిగాలులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories