Tellam Venkat Rao: నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా

Tellam Venkat Rao: సీఎంను కలవడంపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు వివరణ

Dhatripriya
Published on: 6 March 2024 12:55 PM IST
Tellam Venkat Rao Explained Why He Meet CM Revanth Reddy
X

Tellam Venkat Rao: నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా

Tellam Venkat Rao: భద్రాచలం బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సీఎం రేవంత్‌తో భేటీపై సొంత పార్టీ నుంచి ఆరోపణలు రావడంతో.. వివరణ ఇస్తూ వీడియోను రిలీజ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి‌తో కలిసి వెళ్లానని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిని కలవడంలో తప్పు తప్పులేదని భావిస్తున్నట్టు తెలిపారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రిని కలిసి నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లోనే భద్రాచలం నియోజకవర్గం వెనుకబాటుకు గురైందన్నారు. మళ్లీ తాను అలాంటి తప్పిదం చేయదలచుకోలేనన్నారు. ఇక భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకొని సూచన చేస్తారో.. దాని ప్రకారం ముందుకు వెళ్తానని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story