Telangana: ఇంటర్‌ పరీక్షలు జులైలో?

Telangana: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జులైలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Venkata Chari
Published on: 27 May 2021 7:40 PM IST
Telangna Inter Exams In July?
X

ఇంటర్ ఎగ్జామ్స్ (ఫొటో దిహన్స్ ఇండియా)

Telangana: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు జులైలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాశారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఇంటర్ సెకండీయర్ పరీక్షలు జులై మధ్యలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

పరీక్ష సమయాన్ని మూడు గంటల నుంచి గంటన్నరకు తగ్గించేందుకు ఉన్న ఆఫ్షన్లను పరిశీలిస్తున్నామన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్షా విధానాన్ని మార్చలేమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు సగం ప్రశ్నలకే జవాబులు రాసేలా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది. కొవిడ్ కారణంగా పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మరోసారి నిర్వహిస్తామని, రిజల్ట్‌లను ఆగస్టు నెలాఖరులో వెల్లడిస్తామని కేంద్రానికి తెలిపింది.

Venkata Chari

Venkata Chari

Next Story