Governor Tamilisai: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది..!

Telangana’s Inclusive Development is a Role Model to the Nation Says Governor Tamilisai Soundararajan
x

Governor Tamilisai: దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది..

Highlights

Governor Tamilisai: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Governor Tamilisai: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చాటిన ప్రముఖ కవి కాళోజీ నారాయణ రావు కవితతో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని.. తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని తెలిపారు.

వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశామన్నారు. రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించామన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని తమిళిసై వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories